మనం హేంగాన్ అనేయడం తేలికే కానీ వేలాడే వాడికే తెలుస్తుంది ఆ బాధేమిటో! మా మనవరాలు ‘రేయ’ తో అమెరికాలో ఉన్నప్పుడు నన్ను చాలా సార్లు (Hang on) వేలాడదీసేది. చిన్న టెంన్ట్హౌస్లో నన్ను కూలేసి ‘Hang on Tatha I will be right back’ అనేసి ఎటో పోయేది. మరోసారి చేతిలో ఐస్‌క్రీమో, పుల్లైసో పెట్టి హ్యాంగాన్ అని పారిపోయి తను తిరిగొచ్చే లోపు కరిగే ఐస్‌క్రీమ్‌ను చూసి తిన్నానా, రాగానే కంటిచూపుతో క్వాంటిటీ ఎస్టిమేట్ చేసి నిజంగానే నన్ను హేంగాన్ చేసేది.

లిటరల్లీ హేంగాన్
ఈ హేంగాన్ చేయడంలో అమెరికన్లు బాగా పండిపోయారు. అక్కడ ఏ కష్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా, ప్రెస్-1, ప్రెస్-2, దాటి, ప్రెస్ అనుకుంటూ పోతూ ఉంటే కాసేపటికి శ్రీశ్రీ గారన్నట్లు ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని’ లైన్లో పెట్టి మనకు సంగీతం వినిపిస్తారు. కాలం అలా కరిగిపోతుంది. శ్రీశ్రీ గారి పాటలో ‘ఎదురుచూసి మోసపోకుమా’ మనం పూరించుకుని విసుగు చెందని విక్రమార్కునిలా మరల ఒకటి నొక్కి (ఇంచుమించు పరమపద సోపాన పటంలో 106 గడ్డిలో ఉన్న అరుకాషుడి కాటుకి గురై మళ్ళీ మొదటి గడిలో పడ్డట్లే), రెడ్డొచ్చే మొదలెట్టు అన్నట్లే.
ఈ లోపు గొఱ్ణెపిల్ల దారి తప్పితే ‘ఛెయ్, ఎహెహె’ అని కాపరి అదలాయించినట్లు ‘we appreciate for your patience’ అని మనకొక కాంప్లిమెన్ట్ పడేసి, ఓదార్చి మరల సంగీతం కొనసాగిస్తారు.
అమెరికన్లను చూసి మనవాళ్ళూ ముదిరిపోయి అదే బాణీ మన దగ్గరా మొదలెట్టి మొజార్ట్, బీతోవెన్ స్థానే, వేణుగానంతోనో మనల్ని బుజ్జగిస్తున్నారు. ఒకనెల రోజూ కష్టమర్ కేర్లకు ఫోన్లు చేస్తే మనకు కొంత సంగీత జ్ఞానమబ్బవచ్చు లేదా బి.పి. పెరగనూవచ్చు.

టీవీ సినిమాలకో, సీరియల్స్కో ఆశపడి అవి చూసినా అంతే. ఎవరు కోటీశ్వరుడులో నాగ్ భయ్యా ‘చిటికెలో వస్తా’ అనో, KBC లో బిగ్ బీ ‘I will be right back’ అనో మనల్ని దిక్కుమాలిన యాడ్స్ బారిన పడేసి జారుకుంటారు. మా చిన్నప్పటి సిటీబస్సుల ‘హోల్డాన్’ కు రూపాంతరమే హేంగాన్. నోట్ కంటె ఫుట్‌నోట్ పెద్దది అన్నట్లు సినిమా రెండు గంటలైతే యాడ్స్ రెండున్నర గంటలు. వెరసి నాలుగ్గంటల పాటు మనం కౌచ్ పొటాటోలై హేంగానే!
బుల్లి తెరపైనే కాదు రియల్ లైఫ్‌లోనూ మనందరం హేంగానే. ఖర్మకాలి (ఖర్మకాల్తేనే గవర్నమెంట్ ఆఫీస్‌కు పోవాల్సి వస్తుంది) పనిపడి ఏ గవర్నమెంట్ ఆఫీసుకో పోయమా హేంగానే. సర్వసాధారణంగా చిన్నసార్లు ఆఫీసు సీట్లలో ఉండరు. పెద్దసార్లు ఊళ్ళల్లోనే ఉండరు. మరీ పెద్ద సార్లైతే దేశంలోనే ఉండరు. అక్కడ మనల్ని చూసి ద్వారపాలకులు సెల్ చూసుకుంటూ చాలా dispassionate గా ‘కూర్చోండి, సార్ వస్తారని హామీ ఇస్తారు. గంటలు గడుస్తాయి. మనం రెండు టీలు తాగేసి క్యాంటీన్ వాడ్ని ఉద్దరించేసి, ఆఫీసు కాంపౌండ్‌లో చెట్ల కొమ్మల ఆకులు గిల్లి, మళ్ళీ వచ్చి (మనల్ని మనం గిల్లుకోలేం కదండీ) కూర్చుని గోడ మీద కేలండర్‌ని (సాధారణంగా ఐదారేళ్ళ నాటిదే హేంగై ఉంటుంది) మన ఇంట్లో పెద్ద వాళ్ళు హిందూ పేపర్ చదివినట్లు అక్కడున్న సిటిజన్ చార్టర్‌ను పై నుంచి కిందకు, కింద నుంచి పైకి పదిసార్లు చదివేస్తాం.
ఎంతటికీ సార్ జాడ ఎంతకూ తెలియదు. మన దీనావస్థను గమనించి దా॥పా॥ ‘సోమవారం పదిగొట్టంగ రండి, సార్ ఖచ్చితంగ దొరుకుతడు’ అని హేంగాన్ నుండి టెంపరరీగా ఉపశమనమిస్తాడు.
మరీ పెద్దసార్ల దర్శనానికి పోయినప్పుడు మనం బయట పేషీలో (మన ఖుషీ తగ్గిస్తుంది కనుక ప్రాస కోసం పేషీ అంటారో లేక జనాలు వేచివేచి పాసం, పేసం అయిపోవాలని అలా అంటారో!) వేలాడుతూనే ఉంటాం. సాయంత్రమవుతుంది. సార్‌కు టైమ్ టు టైమ్ అన్నపానాదులు కాఫీ, తేనీరులోనికి పోతుంటాయి. ఖాళీకప్పులు, ట్రేలు బయటికి వస్తుంటాయి. బాహుబలిలో కట్టప్ప రహస్య ద్వారం నుండి శివగామిని, దాటించేసినట్లు ఎప్పుడో పెద్దసార్ తప్పుకుంటారు. వారు అలా నిష్క్రమించిన పిదప ద్వా॥పా॥ ‘అరె సార్ లోపట్నుండి అట్నే పోయిండు. మీకు చెప్పడం మరిస్తి’ అని మనల్ని తోలేస్తాడు.
మనం గోల్కొండనో, పాత గుడినో చూడ్డానికి పోతే అక్కడి గైడ్ ఒక కన్నం చూపించి ఇక్కడ నుండి ఒక కందకం ఉండేది. అది గోల్కొండ నుండి ఛార్మినార్ వరకు కాశీనుండి రామేశ్వరం వరకు ఉండేది అంటే అస్సలు నమ్మేవాడ్ని కాదు. మెక్సికో నుండి అమెరికాకు డ్రగ్స్ చేర్చడానికి ఇటీవల కందకాలు, సొరంగాలు బయటపడ్డంతో మన గైడ్ల కందక కథలూ నమ్మక తప్పలేదు.
మన ఉపనిషత్తుల్లో కొన్ని కథలు విన్న తరువాత హేంగాన్ మరీ అంత చెడ్డేం కాదనిపిస్తుంది. నచికేతుడి నాన్న కోపంతో నిన్ను యముడికి దానమిచ్చానని చెప్పగానే, ఆ బాలుడి యమలోకానికి పోయాడట. యముడి పేషీలో చిత్రగుప్తుడు సార్ టూర్లో ఉన్నారని బాలుడికి చెప్పాడట. నచికేతుడు బాలజ్ఞాని కావడంతో అక్కడు మూడు రోజులు వేలాడి యమధర్మరాజు వచ్చిన తరువాత తన క్వశ్చెన్ బ్యాంక్ తెరిచి ఆయనతో అమితుమి తేల్చుకుని బ్రహ్మజ్ఞాన విద్య సాధించి, ‘Patience pays’ అని రుజువు చేసాడు.

యమహేంగాన్
కురుక్షేత్ర సంగ్రామానికి ముందు సహాయార్థమై వచ్చిన సుయోధనుడు కృష్ణుడు దొంగ నిద్ర నుండి లేచే వరకు హేంగాన్ అయ్యాడు. జగన్నాటక సూత్రధారి లేట్ ఎంట్రీ ఇచ్చినా బామ్మర్థి అర్జునుడి వైపే సైడయ్యాడు. విశ్వామిత్రుని బాకీ వసూలు చేయడానికి నక్షత్రకుడు వెంట వేళ్ళాడ్డం వల్లనే కదా ‘సాదా’ హరిశ్చంద్రుడు కాస్తా ‘సత్య’ హరిశ్చంద్రుడై ధరలో నిలిచాడు.

భద్రాచల క్షేత్ర మహిమ వింటే గాని హేంగాన్ మహిమ మీరు తెలుసుకోలేరు. వనవాసంలో ఉన్న సీతారామచంద్రుల్ని తన అతిథిగా ఉండమని భద్రుడు కోరాడట. నీ కోర్కెను తిరుగు ప్రయాణంలో తీరుస్తాను అని మాటిచ్చిన శ్రీరాముడు సీతావియోగంతో పలుకష్టాలు పడి రావణ సంహారం తరువాత భద్రుడికిచ్చిన మాట మరచి నాన్‌స్టాప్ పుష్పక విమానంలో లేవోవర్స్ ఏమీ లేకుండా అయోధ్య చేరుకున్నాడు. ప్రజారంజకంగా ప్రజాపాలనకొనసాగిస్తూ, అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలతో తలమునకలై రాముడు భద్రునికిచ్చిన మాట పూర్తిగా మరిచాడు. కొంత కాలానికి రామావతారం చాలించి బ్యాక్ టు వైకుంఠం చేరుకున్నాడు.
హేంగాన్లో ఉన్న భద్రుడు గడ్డాలు పెంచేసుకుని రామునికై ఘోర తపస్సాచరించడంతో గజేంద్ర మోక్షానికై వైకుంఠాన్ని వీడిన తీరుగనే మహావిష్ణువు పరుగుపరుగున వచ్చి భద్రునికి దర్శనమిచ్చాడు. భద్రుడు శ్రీ మహావిష్ణువును చూసి ‘నువ్వు నా రామునివి కాదు’ (ఆధార్ కార్డులు లేని రోజులు కదండి). నాటి రూపు చూప నమ్మగలనని మొండికేసాడు. ఎస్.పి. దొరగారు పోలీసు ఠాణాకు ఆకస్మిక తనిఖీకొస్తే కంగారులో సెంట్రీ కానిస్టేబుల్ టోపి తిరగేసి, బెల్ట్ అడ్డదిడ్డంగా పెట్టుకుని ఎదరైనట్లే, భక్తుని కోసం రాముడు అపసవ్యంబులైన ఆయుధాలు ధరించే భద్రుని తరింపచేసాడు. నైటీల్లో ఉంటే ధర్మపత్ని ఎప్పుడైనా చీరతో ఇంట్లో తిరుగుతుంటే ఆమెను పరస్త్రీగా భావించి కొంత సేపైన పిదప ఆమే తమ ఇంటి నైటిం
గేలని గుర్తించి పతిదేవుడు పిల్లలతో మాతృవందనం చేయించిన తీరుగనే అనుకోండి.

అమితానందం భరతుడైన భద్రుడు ‘ఫ్రీజ్’ చెప్పేసి రాంగ్ పోశ్చరైనా పర్వాలేదు, ఆ తీరుగునే నా శిరమున వెలయుము అని రాముని కోరాడట. భద్రుడు హేంగాన్ అవ్వక తన దారిన తాను పోయుంటే మనకు భద్రాద్రి రాముని కళ్యాణమూ లేదు, రామదాసు కీర్తనలూ లేవు.
భక్తి మార్గంలో భద్రుని హేంగాన్ స్ట్రాటజీ ఆదర్శవంతమైనది, ఆచరణీయమైనది. పాపం ఎటొచ్చి జాంబవంతుడి హేంగానే త్రేతాయుగం నుండి ద్వాపరయుగం వరకూ కొనసాగింది. భద్రుడి హేంగాన్ భక్తి కోసమైతే జాంబవంతునిది ఫైట్కోసం. నాకు తెలిసి అన్నిటికంటె బెస్ట్ హేంగాన్ స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ (శివయ్య) సోమయాజులు గార్ని ఉద్యోగం అడగటమే!

బెస్ట్ హేంగాన్
మన ఎలక్షన్లలో ఏ పార్టీకి తగిన అంగు లేకపోతే మనకు మిగిలేది హంగే. ఎవరో ఒకర్ని ‘కొని’ ఆడేవరకు, ఎవరో ఒకరు కప్పగంతులేసేవరకు మన నేతల భవిష్యత్తు విశ్వామిత్రుడు తపశ్శక్తి (AI) తో మరోలోకం సృష్టించే వరకూ త్రిశంకుడు హేంగైనట్లే.
మా కాలేజి డేస్‌లో బీటెయ్యడం, సైట్కొట్టడం హేంగానే. పోలీసు బీటు కనిష్టీబు, నేపాలీ గుర్ఖా పహారా కాసినట్లు అమ్మాయిల బాల్కనీ ముందో, గేటుముందో క్లాస్ముందో, టైప్ ఇనిస్టిట్యూట్ ముందో సంచరిస్తూ, సంచలిస్తూ వేలాడ్డం ఎవర్గ్రీన్ సీనే. ఇవన్నీ ఒక వొంతు అయితే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యంలా మధుప్రియులకు రోజూ ఉదయం కలిగే వైరాగ్యాన్నీ హేంగోవర్ అనే అంటారట. వారు కాసేపు పశ్చాత్తాప హృదయంతో పరితపించి హేంగోవర్ పోగానే సాయంత్రం మళ్ళీ start over అనేస్తారు.
కార్పొరేట్ హాస్పిటల్స్, నక్షత్ర హోటళ్ళ హేంగాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం కన్సల్టేషన్ కోసం వెళ్ళినప్పుడు పెద్ద డాక్టర్ల వరండాల్లో హేంగాన్లో గంటలు గడిచిపోయి ఒక్కోసారి మనకు గడ్డాలూ పెరుగుతాయి. హాస్పిటల్ నుండి పెషెంట్‌ని డిశ్చార్జ్ చేస్తామని చెప్తే, మనం అన్నీ సర్దేసుకుని కూర్చుంటాం. ఆ తరువాత వేలాడి వేలాడి అందరి వెంటబడినా ఫైనల్ బిల్లు తయారై పేషంట్ బయటపడేది ఈవినింగ్ స్టార్స్ వచ్చాకనే.
ఈ విషయంలో స్టార్ హోటళ్ళూ తక్కువేమీ కాదు. అక్కడ ఆర్డరిచ్చిన గంటకు ఫుడ్ వస్తుంది. తిన్న తరువాత బిల్లు మరోగంటకు వస్తుంది. ఎందుకింత ఆలస్యం అంటే ఆంగ్లంలో “Sorry for the delay Sir” అని ఓదార్పునిస్తారు. మనం ఒక వెర్రి నవ్వు నవ్వి ‘its ok’ అని బయటపడతాం. ఇలా జీవితంలో అందరం ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక దగ్గర హేంగాన్ అయినవారమో, అవ్వాల్సిన వారమో!

డాక్టర్ నిరీక్షణ్రావ్
మనుషులకే కాదు నోరులేని కంప్యూటర్లకూ మాయదారి హేంగానే పెద్ద జాడ్యం. సిస్టమైనా, బుర్రైనా వేడెక్కితే అయ్యేది హేంగానే. ఇక్కడితో నా హేంగాన్ నుండి మీ అందరికీ తక్షణమే విడుదల….

Sign up for our affiliate program and watch your earnings grow! https://shorturl.fm/MKoM1
Join forces with us and profit from every click! https://shorturl.fm/BAh0J
Apply now and receive dedicated support for affiliates! https://shorturl.fm/YsAP8
Become our partner and turn referrals into revenue—join now! https://shorturl.fm/NbYml
Your audience, your profits—become an affiliate today! https://shorturl.fm/j02db
Earn recurring commissions with each referral—enroll today! https://shorturl.fm/Jx64J
Share your unique link and earn up to 40% commission! https://shorturl.fm/MYwge
Join our affiliate program today and earn generous commissions! https://shorturl.fm/Afd4r
Maximize your income with our high-converting offers—join as an affiliate! https://shorturl.fm/hE2qL
https://shorturl.fm/hQjgP
https://shorturl.fm/IPXDm
https://shorturl.fm/JtG9d
https://shorturl.fm/PFOiP
https://shorturl.fm/bODKa
https://shorturl.fm/XIZGD
https://shorturl.fm/6539m
https://shorturl.fm/6539m
https://shorturl.fm/68Y8V
https://shorturl.fm/A5ni8
https://shorturl.fm/bODKa
https://shorturl.fm/N6nl1
https://shorturl.fm/j3kEj
https://shorturl.fm/TbTre
https://shorturl.fm/YvSxU
https://shorturl.fm/a0B2m
https://shorturl.fm/68Y8V
https://shorturl.fm/m8ueY
https://shorturl.fm/5JO3e
https://shorturl.fm/9fnIC
Very good https://is.gd/N1ikS2
Awesome https://is.gd/N1ikS2
Awesome https://is.gd/N1ikS2
Good https://lc.cx/xjXBQT
Very good https://shorturl.at/2breu
Awesome https://shorturl.at/2breu
https://mazda-demio.ru/forums/index.php?autocom=gallery&req=si&img=6339
Please “Hang on” for my feedback.
బాగానే ఉన్నది . మొదటిలో ‘హంగాన్ ‘ ఆ ని చూ చి ఇదేదో తా గుడు భాగవతమేమో అని అనుకొని చదువుతూ న్ననాకు ఆప్రసక్తే కనిపించక , కొంత నేను అనుభవములో పొందిన హంగో వరు గుర్తుకు వచ్చి ఓ చిరు హాస ము తో ముగిసింది.
Bavagaru Hang on
Hats off to your Creativity. A small word Hang on how nicely connected with societal and devotional concepts. Your unique blend of wit, satire and spiritual insight has resulted in a truly captivating and thought provoking experience.
Kudos to your innovative storytelling
Hi Harsha.. I should thank Reya for bringing out “hang on” without much “hang on”..Reya made you to travel several yugas to understand “hang on”..
Superb narrative.. I have yet to come out of “hang on”of your literary skill.
Keep it up
Really enjoyed the blog on the most interesting topic “Hang-on”
The way you have explained the events has certainly touched the invisible hearts of most of the people in our day to day life.
అమెరికాలో మీ మనవరాలు దగ్గర మొదలైన మీ హ్యాంగ్ ఆన్ కథ త్రేతాయుగం ప్రయాణించి ద్వాపరయుగం ద్వారా మరలా మనయుగం చేరి స్వాతిముత్యాన్ని తనలో ఇముడ్చుకుని భలే గమ్మత్తులతో అలరించింది సర్!నమస్కారాలతో
చలం
👏👏
Hilarious but a hard reality.
Enjoyed Harsha.
….. We will hang on for next story, with love 😂