ఏడెనిమిది నెలల క్రితం మిత్రుడు కోదండరామయ్యగారు మా అల్లుడు కలివరపు విజయకుమార్ దర్శకత్వంలో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా వస్తోందని చెప్పారు. ఇదేమి పంచాయితీరా బాబు అనుకునేలోపే అగ్ని మిస్సైల్ లాంటి సుమ గారితో టీజర్ ఫైర్ చేసేసాడు. టీజర్ చూడగానే లీడర్ సినిమాలో గొల్లపూడి గారు సిఎం పాత్ర రాణాతో ‘నీ దగ్గర ఏదో విషయం ఉందయ్యా’ అన్నట్లు ‘జయమ్మ పంచాయితీ’లో కూడా ఏదో విషయం ఉందని అప్పుడే అర్థమయ్యింది.
పోయినవారం అమెరికానుండి తిరిగి రాగానే అమెజాన్ ప్రైమ్‌లో ‘జయమ్మ పంచాయితీ’ చూశా. జయమ్మ ఈడుల పంచాయితీతో మన తెలుగుసినిమాలపై పెద్దపంచాయితీయే పెట్టించాడు మన విజయుడు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ at the back of the mind, అమరావతి కథలు రెండూ మసలుతూనే ఉన్నాయి. నరుకుళ్ళు, కొరుకుళ్ళకు చోటివ్వకుండా, రిచ్ లోకేషన్స్‌కు పోకుండా అత్యంత humble background నుండి వచ్చిన విజయకుమార్ తన తొలి ప్రయత్నంలో ఇంతటి సా(దుస్సా)హాసానికి వొడికట్టినందుకు ‘సాహస బాలుడు విజయకుమార్’ అన్న Title కు అన్నివిధాలా యోగ్యుడు. నా దగ్గర డబ్బులుంటే ఆయన్నే హీరో చేసి ఆ సినిమా తప్పక తీసేద్దును!
ఈ సినిమా చూసిన వాళ్ళెవ్వరైనా ఈ సినిమాలో ఏముంది అంటే ఇందులో ఏమిలేదని ఎదురు ప్రశ్నించేలా ఉంది. మంచి గ్రామీణ నేపథ్యం, చిక్కనైన, కమ్మనైనా ఉత్తరాంధ్ర మాండలికం, సజీవమైన పాత్రలు, అనునిత్యం మనకు అనుభవమయ్యే సంఘటనలు. ఇవి చాలవండీ కడుపునిండడానికి, గుండె పండటానికి? అదనంగా కథ నడిపించిన తీరు ఆద్యంతం రసవత్తరం. తుపాకీ పేల్చని జయమ్మ తుపాకీ మీద పేరుతో anticlimax ను మెరిపిస్తే కాశీ యాత్రతో climax ను మురిపించేలా చేసిన విజయకుమార్ ముగింపు గజల్ చివరి వాక్యాల్లా మక్తాల్లా చమక్కుమనిపించాయి. సినిమాలో జయమ్మ హీరోయిన్ అయితే కనపడని నాలుగోసింహంలా విజయకుమారే దర్శకహీరో.
సినిమాలో జమ్ముడు పాత్ర హైలైట్. మంచి పంచ్‌లతో సర్పంచ్ పాత్రను అద్భుతంగా పండించిన గణేష్ యాదవ్ నటన ఎప్పటికీ గుర్తుండి పోతుంది. కథనం నడిపిస్తూనే అంతర్లీనంగా మానవ సంబంధాలు, విలువలతోపాటు దళితుల దీనావస్థ చెప్పకనే చెప్పిన తీరు అద్వితీయం. మనిషితనం, మంచితనాన్ని మించిన మతం లేదని తెలుసుకుని పశ్చాత్తాపానికి లోనై తప్పు దిద్దుకునే అలాంటి ఊరిపెద్దలు ప్రస్తుతం మన ఊళ్ళన్నింటికీ అవసరమే! పనిలో పనిగా మన రాములోరికీ Visibility కల్పించి అయోధ్య, సంఘ పరివార్లలో Visibility సంపాదించుకున్న కలివరపు గొప్ప కలవరింతే! పలవరింతే! అదే రామానుగ్రహంతో వినోదపన్ను మినహాయింపూ వస్తుందేమో!
హైస్కూల్ చదువంతా శ్రీకాకుళం జిల్లాలో కావడంతో నేను జయమ్మ మాండలికానికి మరింత దగ్గరై Nostalgic అయిపోయి వెంటనే విజయకుమార్‌కు ఫోన్ చేసి అభినందించాను. సినిమాలో యేసుబాబు రిపీటెడ్‌గా దెబ్బలు తగలకుండా సైకిల్ నేర్పిస్తానన్న trap కు అమ్మాయి ఇచ్చిన ఝలక్ బాగుంది. పోలీస్‌స్టేషన్లో పేకాట సీను, ‘మీరు ముందు పదండి మేము ఆటోలో వస్తాము ఎవరన్నా చూస్తే బాగోదు’ అని బతిమిలాడుకునే సీన్లు బాపు, విశ్వనాథ్‌ల సున్నితమై హాస్యాన్ని గుర్తుకు తెచ్చాయి. చిల్లర, వెకిలి హాస్యంతో వేసారిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గొప్పరిలీఫ్.
సినిమా అంతా ఒక ఎత్తైతే చివర్లో గుడి పూజారి ‘నేనంటే నీకెందుకంత ఇష్టం’ అని అడిగితే, ‘‘ప్రపంచానికి దూరంగా నచ్చినట్లు బ్రతికేవాళ్ళకంటే మంచోళ్ళు ఎవరుంటారు సత్యా’’ అని మంచితనానికి మంచి నిర్వచనాన్నిచ్చినందుకు ఎవరైనా వి.విజయకుమార్‌కు ఫిదా అవ్వాల్సిందే. వహ్వా వహ్వా అనాల్సిందే. ఆరు నెలలు అమెరికాలో పిజ్జాలు, బర్గర్‌లు తిని మొహంమొత్తిన మాకు జయమ్మ పంచాయితీ ఆవురావురంటూ కొత్తావకాయతో వేడి అన్నం తిన్నంత గొప్ప అనుభూతినిచ్చింది.
రెండు వందలకోట్ల బడ్జెట్‌తో రెండు తలనొప్పి మాత్రలు వేసుకుంటే కాని తగ్గని మల్టీస్టారర్, హార్రర్ సినిమాలను మనపై రుద్దుతున్న పెద్దలకు ఇలాంటి మంచి సినిమాలు కొంతైనా కనువిప్పు కలిగిస్తే బాగుండు.
సకుటుంబ సపరివారంగా చిన్నపిల్లల కళ్ళు మూయనవసరం లేకుండా, మనం కళ్ళు మూసుకోకుండా కళ్ళారా చూడదగ్గదీ ‘జయమ్మ పంచాయితీ’. మంచి ఆలోచనలు, భావుకత గల విజయకుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ …
(నాతో మొదటి సినిమా రివ్యూ రాయించిన చి॥ విజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలతో …)
Harsha Anna,
The review is very good. It is unbelievable that it is your first review.hereafter you can write reviews for all movies. I have not seen this movie,after reading your review it created interest to watch the movie.
I have seen the movie. It is simplicity personified an big & small screens! As Subba Rao garu said, amidst a plethora of glitzy multi-starrers, ‘Jayamma Panchayati’ comes as a breath of frsh air andeven after its end, the flavor of the movie continues to waft around us ! A movie worth watching collectively with the family !
ఐతే ఒక డాక్టరుగా నాకు పంటి కింద రాయిలాగ తగిలిన సన్నివేశాలు జయమ్మ భర్తకు ఆపరేషన్ కు ఎంత డబ్బు ఖర్చు ఔతుందనే ముందు ఎలాంటి సెంటర్ లో చేస్తారు,వైద్యుల రెస్పాన్స్ ఎలా వుంటుందీ అనేది హోం వర్క్ సరిగా జరిగినట్టు లేదు. మామూలు జనరల్ సర్జరీ సైడు బహుశా కొందరు అలా అడగవచ్చు కానీ గుండె ఆపరేషన్ చేసేంత నైపుణ్యం వున్న ప్రత్యేకవైద్యులు అంత కఠినంగ మాట్లాడతారా.స్తోమత లేని వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెంటనే పంపుతారు. లేదా ఛారిటీ హాస్పిటల్స్ కు పంపుతారు. అలాగే చిన్నపిల్లల లవ్ ట్రాక్ తగ్గించి జయమ్మ గన్ నేపథ్యం ఇంకా కొంత చూపితే బాగుండేది. ఒక నాయకుడి బిడ్డ తమ పక్క పల్లెలో వుంటే వాళ్లకు అసలు తెలియకపోవడమే వింత. ఐనా ఇదంతా
రామాయణంలో పిడకల వేట …..
ఒక మంచి సినిమాను మంచిఎండల మధ్యాహ్నం చల్లని గోలీసోడా తాగిన అనుభూతికీ సుమగారి నటవిజృంభనకు రంగస్థలం తరవాత మళ్లీ అలాటి నిండైన సినిమాను చూపినందుకూ దర్శకులకూ టీంకు శతకోటి వందనాలు.
రాయలసీమలో ఆ సంప్రదాయాన్ని ముయ్యలు చదివించడం అంటారు .ఆడపిల్ల పెళ్లికి ముఖ్యంగా చదివింపులు వుంటాయి. అన్నీ నోటుబుక్ లో రాసిపెట్టి తిరిగి చెల్లించే అలవాటు.
Very good movie anna..really we need to appreciate the director he completed movie with very low budget and having a great stuff…
Anna EDULU is the process to help each others and together celebrateing the function…good anna
Thank you for sharing the post sir, it’s very informative and narrative; we shall watch the movie for sure 👌🏻👏🏻👍🏻
మీరు మన డిపార్ట్మెంట్ లో జరిగిన చాలా సభలలో సరళంగా, క్లుప్తంగా,సూటిగా, సుతిమెత్తగా అందరినీ ఆకట్టుకునేటట్టు చేసిన ప్రసంగాల కి ఏమాత్రం తీసిపోని విశ్లేషణ ఇది.హ్యాట్సాఫ్ టూ యూ సార్.
ఎడారిలో మండుటెండలో నడుస్తున్నప్పుడు నల్లటి మబ్బు చిలకరించిన చినుకుల జడిలో తడిసిన క్షణం కలిగే ఆనందం సినిమా చూసినప్పుడూ కలిగిందని – నీ సమీక్ష చదివినప్పుడూ కలిగింది. కారణం అలాంటి సినిమాలూ, ఇలాంటి సమీక్షలుా – రెండూ అరుదుగా తటస్థించడం వల్లనే అనుకుంటా!
👏👏👏
చూసాను sir, చాలా భాగుంది,మా ఊరు అబ్బాయి ఏసుబబు తండ్రి గా రోల్ ఉంది.మా ఊరు అందరి నీ నేనే డబ్బుల పెట్టి సినిమా చూపించాను. ఉత్తరాంధ్ర స్లాంగ్ తో మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్.
మీ సమీక్ష అదిరింది ‘ జయమ్మ పంచాయితీ’ సినీమా చూడకుండానే అందులో విషయం అర్ధమయ్యేటట్టు చాలా చక్కగా చెప్పారు. తప్పక చూడనే ఉత్సుకత కలిగించారు. అసలు సుమ చేసిందంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో చూడాలనే ఉబలాటాన్ని మీరింకా పెంచారు. చూస్తా తప్పక చూస్తా నమస్తే 🙏🏼🙏🏼🙏🏼——చలం
Kodandaramaiah garu also informed me on phone about this picture directed by his son in law. We are vexed with multi starer ( horror), top hero’s and graphics. Trend of disaster started for such GREAT pictures. Agree with your review. Neatly presented. Such directors need encouragement. Instead of wasting money on costly settings director chose village environment throughout. Vijaykumar gaariki Subhakankshalu.
జయమ్మ పంచాయతీ చూడలేదు , కానీ చూడాలనే ఆసక్తి ఎక్కువ చేసింది . రివ్యూ
చెప్పినతీరు బాగున్నది .చూద్దాము, చూసి మాట్లాడుదాం.
Please review RRR
Which is my first move in theatre after one and half years And I came back from theatre in I travel
It’s true. Jayamma Panchayiti is very well made movie. All lovers of good movie should not miss it. It is a true reflection of a typical village story and connects with everyone who have come from rural background.