11 Replies to “నమ్మకమీయరా స్వామి”

 1. సార్,

  మంచి విషయాన్ని స్పష్టం గా చెప్పారు.ముఖ్యం గా “పద్మ” ల విషయం లో ఎలాంటి బేరాలు లేని పరిస్థితి పరిణితి చెందిన సమాజాన్ని సూచిస్తుంది.రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం ఒక మంచి మార్పు.ఈ పరిణితి ప్రక్రియకు సాహిత్యం,అంతర్గత విశ్లేషణ ప్రధాన భూమిక పోషించిందని భావన..

  మరో మంచి వ్యాసానికై ఎదురు చూస్తూ…

  జైశంకర శర్మ

 2. కొమరం పులి లో పాటనే ప్రస్తుత పరిస్థితులకి పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానానికి విజయానికి మీరు చాలా చక్కగా సమన్వయపరిచి చాలా బాగా ఎనలైజ్ చేశారు .
  అన్నింట్లోకి వింబుల్డన్ కోర్టు ముందు విజయాన్ని అపజయాన్ని ఎలా చూడాలో చెప్పిన లైన్లు చాలా బాగుంది.

  పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యంగా ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొని స్థిరంగా పోరాడారు.
  రాజకీయాలకి కొత్త భాష్యం చెప్పారు. అధికారం సేవ చేయడానికి మాత్రమే కానీ సేద తీరటానికి కాదు అని నిరూపించారు.

  వారిని ఎప్పుడు చూసినా గుర్తుకు వచ్చిన శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో

  “నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం ”

  అనే పదాలు నాకు గుర్తొస్తా ఉంటాయి.

  హర్ష గారు ఈ భావాలన్నీ ఆలోచనలు అందరిలో ఉంటాయి కానీ వాటిని చక్కగా వ్యక్తీకరణ చేయటం మీరు ఆపోసన పట్టారు చాలా బాగుందండి చాలా చక్కగా చేశారు. అభినందనలు మీ బైరా దిలీప్ చక్రవర్తి.

 3. From Writing an article: about appreciating the recognition of Padmasri awardees which depicts even simpler people can be recognised by the government; to linking it to a movie star who believes in simplicity transitioning to Deputy CM.

  Great comparison sir.

  Mee creativity ki Koti Vandanaalu👌

 4. Mavayya, naaku baaga nachina vishayam meeru rasina danilo..gelichina vallu choopinchalsina vinamrata, very great learning through the lens of Pawan Kalyan. Thanks for putting this together.

 5. జనసేనాని పవన్ గురించి మీ(మన) తరం వారు కూడా ఎంతోకొంత ఆశావాదాన్ని మిగుల్చు కొనుటకు ఆయన నడవడిక, పరిశ్రమ, పట్టుదల, సంస్కారం కారణమైతే…
  మీ శైలిలో స్ఫూర్తినిచ్చే విశ్లేషణ చాలా హర్షనీయంగా ఉంది ఎప్పట్లాగానే!🙏🏻

 6. ఒక గొప్ప సంపాదకీయం చదివినప్పుడు కలిగే ఆనందం, అనుభూతి కలిగాయి. ఉపమానాలను మించి ‘ఉదాహరణలు’ జాలువారాయి. విషయం ధాటిగా అర్థం కావడానికి తోడ్పడ్డాయి. అన్నిటికంటే మించి శైలి యొక్క ప్రవాహగతి ఆకర్షణీయం.

 7. Fantastic Harshvardhan Garu .The way you analysed the chatacter of Pavan Kalyan is Marvellous sir. You clearly visualised how Pavan Kalyan bounce back & reached his ultimate goal is highly appreciated.You clearly mentioned the people’s mandate is exemplary not giving any room to free schemes avoiding development of the state .

  1. 2019లో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితిని ఈనాటి పరిస్థితిని అంచనా వేస్తే అసలు పోలికే లేదు. కారణం ఒక రోజు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు వేదికపై ఎంపీ కాండేట్స్, ఎమ్మెల్యే కాండిడేట్స్ కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వేదిక మీదకు వచ్చి ప్రజల చప్పట్లు మధ్య ఉపన్యాసం ఇచ్చేసి, కనీసం అభ్యర్థుల ముఖాలను కూడా పరిచయం చేయకుండా దిగి వెళ్లిపోయారు. నాటి ఎం.పి. అభ్యర్థి డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు ఆవేదన చెందారు.
   ఒకరోజున అందరూ పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటే మీరు ముందు నన్ను గెలిపించండి అంతేకానీ మీరు నన్ను సీఎం అన్నంత మాత్రాన, నేను సీఎం కాలేను అని వాళ్ళకి చెప్పారు. నిజానికి రెండు చోట్ల పోటీ చేసినప్పుడు ఒక్కచోట కూడా నెగ్గకపోవడానికి కారణం తన వల్లే అనే భావన కలగడం. ఆ తరువాత కాలంలో పరిణతి చెంది మానసిక ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 2021 సం.లో సంవత్సరంలో మన నుడి మననది అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టారు. ఒకరోజు తెలుగు సాహిత్యానికి సంబంధించి సభ జరుగితే నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రక్కన కూర్చున్న నాకు అప్పటికే చాలా పరిణతి వారిలో కనిపించింది. ఆ మధ్యాహ్నం గౌతమి గ్రంథాలయానికి వచ్చి చాలా నిశితంగా పరిశీలించారు.
   వారి సామాజిక వర్గం వారు ఎంత రెచ్చగొట్టినా నిలువరించి 21 సీట్లనే తీసుకొని నెగ్గించగలిగారంటే నిజంగా ఆయన దార్శనికతకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు ఇటీవల జరిగిన సభలలో వారి మాటలాడే తీరు అచ్చెరువు గొలిపింది. వారికి శుభాభినందనలు. తన వ్యాసంలో వారిని ఉట్టంగించినందుకు హర్ష హర్షవర్ధన్ గారిని అభినందిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.