మన జీవితంలో బాల్యం మాత్రమే బంగారుమయం, మిగిలిన జీవితమంతా పోగొట్టుకున్న బాల్యాన్ని దేవులాడుకోవటమే. మనం అమ్మ కడుపున పడినప్పుడు మొదలైన దేవులాట కనుమరుగై పోయే వరకు నిరంతరంగా సాగిపోతుంటుంది. బిడ్డ పుట్టకముందు నుంచే మంచి పేర్ల కోసం దేవులాట. పుట్టి పెరుగుతుంటే మంచి స్మూళ్ళ కోసం దేవులాట. “ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందరవందర, అని ఆరుద్రగారు ఎంత హెచ్చరించినా మనం మంచి కాలేజీల కోసం, ఉద్యోగాల కోసం, మీసాల కోసం, వీసాల కోసం దేవులాటే. ఉద్యోగంలో చేరగానే పెళ్ళి కోసం పిల్ల/ పిల్లోడి కోసం దేవులాట. పెళ్ళయితే ఇళ్ళకోసం, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల కోసం వేట. మరింత ముదిరితే విల్లాల కోసం. నానా కష్టాలుపడి ఉద్యోగం సంపాదించి పోస్టింగుల కోసం, ప్రమోషన్ల కోసం వెంపర్లాట.

నలభైలు దాటగానే చిన్న మతి మరుపుతో తాళాల కోసం, కళ్ళద్దాల కోసం, కట్టిన కరెంటు బిల్లుల కోసం దేవులాట. పనిలో పనిగా బి.పి, షుగర్ల పుణ్యాన డైటీషియన్ల కోసం, పర్సనల్‌ కోచ్‌ల కోసం దేవులాట. ఇవి చాలవన్నట్లు యూట్యూబ్‌లో పడి వీరమాచనేని, ఖాదర్‌వల్లి, కీటో, అవకాడో కోసం ఏంపాడో దేవులాట. దిమాక్‌ ఖరాబ్‌తో మంచి సైకియాటిస్టు కోసం, మెడి క్లెయిమ్ పాలసీ కోసం మళ్ళీదేవులాట. ఇవేవీ పనిచేయకపోతే గురువుల కోసం, బాబాల కోసం రుద్రాక్షల కోసం ఉంగరపు రాళ్ళ కోసం దేవులాట.

యాభైల్లో పడగానే ఇంకాస్త ముందుకెళ్ళి సౌకర్యవంతమైన ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ల కోసం దేవులాట. ఎన్నో ఉన్నత పదవుల్లో ఎంతో అధికారం చెలాయించినా రిటైరవ్వక ముందు నుంచే నామినేటెడ్‌ పదవుల కోసం దేబిరించడం. ఇంకాస్త తెలివుంటే ఇంకో అడుగు ముందుకేసి మెళ్ళో ఏదో రంగు కండవాయేసుకుని పార్టీ టికెట్ల కోసం దేవులాట. కథ ముగిసిపోయి మహాప్రస్థానం కూడా అయిపోతే మన స్థాయికి ధీటైన కైలాస భూమి కోసమో, వైకుంఠవాసం కోసమో దేవులాట. అదీ అయిపోతే పంపకానికి స్టీల్‌ గిన్నెలకోసం దేవులాట. ఇలా జీవితాంతం మనల్ని వెంటాడే దేవులాట అంతా బహిర్‌దేవులాటే. అందుకేనేమో బయటే దేవులాడతామని తెలిసిన దేవుడు మనలో మాత్రం వెతుక్కోమని మనలో దాక్కున్నాడు. ఈ సత్యం తెలిసిన గురువు “వెదికితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువరా?” అని అడిగితే “ఆత్మలోన శోధచేసిన దొరకురా” అని చెప్పారు. మనంపడే ఈ పాట్లన్నీ చూస్తే ఇది దేవులాట కాదు. “దేవుళ్ళు మనతో ఆడే ఆట గదరా శివా!” అనిపిస్తుంది.
అందుకేనేమో మహాకవి శ్రీశ్రీ …

“వేళకాని వేళలలో లేనిపోని వాంఛలతో
దారికాని దారులలో కానరాని కాంక్షలతో
దేనికొరకు పదేపదే దేవులాడుతావు” అన్నారు.

ఈ దేవులాటలో ఇప్పటికే చాలా బాగా ఆడి భారీ స్మోర్‌ చేసేసాం కనుక ఈ ఉగాదికైనా Declare చేసేసి ఈ దేవులాటకు ముగింపు చెప్పకపోయినా కాస్త ఆగి, ఆలోచించి మన దృక్పథం మార్చుకుందామని తీర్మానించుకుందాం. అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో …

10 Replies to “దేవులాట”

  1. దేవులాట రచన బాగుంది జీవించడమంటెనే ఇతరుల మెప్పు కొరకు దేవులాట కదా🌺👏🙏🏻

  2. ఇది చదువుతుంటే , ఊ! ఇవన్నీ తెలిసిన విషయాలేగా అనిపించినా , ఒక సారి విషయావలోకనం చేస్తే మనిషి “దేవులాట” అనే ప్రవర్తనతోనే (జీవనశైలి) ఆటవిక దశ (దిశ) నుండి ఆధునిక దిశకు తరలాడు అనే పరిణామక్రమం గతమైతే , ప్రస్తుతం అదే దేవులాట(మించిన
    వెంపర్లాట) లో మనిషి జీవనస్థిత గతులను అర్ధవంతంగ చెప్పిన వైనం ఆలోచింపచేసేదిగా వుంది..
    చివరిగా “ఈ దేవులాటకు ముగింపు లేదంటూనే కాస్త ఆగి, ఆలోచించి మన దృక్పథం మార్చుకుందామని తీర్మానించుకుందాం.” అని వ్రాయడం శుభపరిణామ సంకేతం
    మనిషి ప్రవర్తనలో పరివర్తన వుండొచ్చును కాని పరావర్తనం కాదనేది నా భావన.

  3. Sir, Most of the incidents mentioned in your blog are connected to the majority of the people during their journey of life in one way or the other.

    I think the we shall minimise the “searching” only when we exit from the rat race.

    Need clarification on the point “Medi Crime” is this written deliberately or a typo error 🙏🏻

  4. Jeevitha manthaa thanakaladatame.Anxiety…venparlaata…un quenched desires never allows us to be happy. Your Explicit expressions are so spontaneous and natural. Thank u sir

  5. Bhoomi meeda naruni kaalamantha yudda kaalame annadu parisuddatmudu you grandamlo. Vethiki vesaarina naaku dorikaadu Rakshakudyna Yesu Kreesthu. Cheppaleni saanthi-nemmadi andukunnanu pondukunnamu. Manishi hrudilo Mahatmuni Sriram nivaasam. Ee Matti sareeramlo devuditchina mahadyswaryam. Ade Paramatmatho nitya nivaasam. Anduke we bhayanaka carona kaalamlo kutumvam – sangham – vooru – District – state – bharathavani – anthems yavath prapancham kosam Prardana Mano duhkamtho.

  6. Really nice sir..narrated beautifully.
    Nijame epudu devulatathone jeevitham gadichipothundi…
    🙏🙏🙏

  7. Congratulations on starting this blog and sharing valuable suggestions and giving insights into life based on your experiences..By this way u have become more closer to us ..just a phone away when compared to books..All the best..

    1. Sir
      Most of the People are living without satisfaction by not enjoying with what they have and waiting for what they do not have. In the meanwhile life comes to an end. Your article is excellent on this subject. Congratulations.
      Anjaneya Reddy sumasri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.