చదువు జీవన భృతి కోసం కాదు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అవసరం. శాశ్వత సుఖసంతోషాలకు అవసరమయ్యే జ్ఞానాన్ని ప్రసాదించటం విద్య లక్ష్యం కావాలి. తప్పు డిగ్రీలు లాంటి కొలతల కోసం కానీ, అనుకరణను పెంచటానికి కానే కాదు. మనలోని సహజ సంపత్తిని పెంపొందించి భవిష్యత్ జీవితంలో వచ్చే అన్ని రాగద్వేషాలను సమానంగా చూడగలిగే శక్తినిచ్చేదే అసలైన చదువు.

రుక్మిణీదేవి అరండేల్

‘పైన చెప్పిన ఉన్నతాశయాల కోసం చదవాల్సిన చదువు నేడు కేవలం డిగ్రీల కోసం, జీతాల కోసమే చదివే స్థాయికి విద్యా వ్యవస్థ దిగజారడం దురదృష్టకరం. పోటీతత్వంతో కేవలం తరగతి సిలబస్‌ పుస్తకాలు తప్ప మరేయితర పుస్తకం చదివే అలవాటు, అవకాశం లేని పరిస్థితులు రావడానికి కార్బొరేట్‌ కాలేజీలు, తల్లిదండ్రులు కొంతకారణమైతే టి.వి.లు, సెల్‌ఫోన్‌లు, ఐప్యాడ్‌లు ఇంకొంత కారణం. ఒకప్పుడు బాగా చదువుకున్న వాళ్ళను well read man అని గౌరవించేవారు. కాని అదే పనిగా టి.వి చూసే వాళ్ళను well viewed man అని గౌరవించలేం అన్నది మనం తెలుసుకోవాలి. పుస్తకాలు చదివే అలవాటు ఏ స్థాయికి పడిపోయిందో ఇటీవల ఒక సర్వేలో బయటపడింది. సదరు సర్వే ఫలితాల్లో ముప్పె మూడు శాతం మంది హైస్కూల్‌ చదువు పూర్తయిన తరువాత ఒక్క పుస్తకం కూడా చదవడం లేదని, నలభై రెండు శాతం కాలేజి గ్రాడ్యుయేట్స్‌ కాలేజి చదువు తరువాత ఏ ఒక్క పుస్తకమూ చదవడం లేదని, యాభై ఏడు శాతం మంది వారు చదవడం ప్రారంభించిన పుస్తకాన్ని
పూర్తి చేయలేదని తేలింది.

ఈ సర్వే ఫలితాలు చూసాక నాకు ఎదురైన ఒక అనుభవం గుర్తుకొచ్చింది. కొన్నేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ (APPSC) గ్రూప్‌ II పోస్టుల సెలక్షన్‌ కోసం అభ్యర్థులకు నిర్వహించిన ఇంటర్వ్యూలకు నేను ఒక వారం రోజులు ఇంటర్వ్యూ బోర్డు సభ్యుడిగా వెళ్ళాను. సుమారు 180 మంది అభ్యర్థులను ప్రశ్నలడిగే అవకాశం వచ్చింది. వాళ్ళలో కనీసం వంద మంది అభ్యర్థులు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, బి.ఇడి. కూడా చేసి హైస్కూల్స్‌లో ఫస్ట్‌ గ్రేడ్‌, సెకండ్‌ గ్రేడ్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారే. వాళ్ళందరినీ “మీరు విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాల పుస్తకాలు కాకుండా మీ ఆసక్తి కొద్దీ కనీసం ఒక్క పుస్తకమైనా చదివారా?” అని అడిగాను. వంద మందిలో ఎవ్వరూ ఒక్క పుస్తకం కూడా చదవలేదు అని సమాధానం చెప్పారు. చదవక పోవడం విచారకరమైతే ఇలా చెప్పిన వాళ్ళందరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ కూడా ఏమీ చదవకపోవడం మరింత బాధించింది.

ఇదంతా ఎందుకు ప్రస్తావించడమంటే పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులే ఇలా ఉండే పైన చెప్పిన సర్వే ఫలితాలు అలా ఉండటంలో ఆశ్చర్యమేముంది. చివరకు సివిల్స్‌ పరీక్షల కోసం కష్టపడి ఎన్నో పుస్తకాలు చదివి I.A.S, I.P.S అధికారులుగా సెలక్ట్‌ అయిన వాళ్ళల్లో చాలా మంది ఉద్యోగం వచ్చిన తరువాత పుస్తకాలు చదవడం లేదన్నది కూడా నేడు అంతే వాస్తవం.

గతంలో జార్జి బెర్నాడ్‌షాను ఎవరో ఒక పాఠకుడు మీకు అన్నిటికంటే ఏ పుస్తకం అంటే ఇష్టం అని అడిగితే ఆయన తడుము కోకుండా my cheque book అని సమాధానం చెప్పారట. వారు వ్యంగ్యానికి అన్నమాట ప్రస్తుతం వాస్తవం అయిపోయింది. మనందరికీ ప్రస్తుతం cheque book మాత్రమే అపురూపమైన పుస్తకం. మిగిలిన పుస్తకాలన్నీ దాని తరువాతే. కేవలం ఉద్యోగ సాధన కోసమే చదివే చదువు వలన knowledge ‘పెరుగుతుందేమో కాని wisdom మాత్రం పెరగదు.

“పుస్తకాలు లేని విశ్రాంతి చావుతో సమానం” అంటాడు ఒక మహనీయుడు. పుస్తకాలు చదవడం వలన ప్రపంచం అవగతమవటమే కాక సృజనాత్మకంగా జీవించడం అలవడుతుంది. ప్రతి ఒక్కరి దైనందిన జీవనంలో ఈ అధ్యయనం భాగం కావాలి. పిల్లలకు బాల్యం నుండే గ్రంథాలయానికి తీసుకు వెళ్లి పుస్తక పఠనాసక్తి పెంపొందించాలి. వారు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నా ప్రోత్సహించాలి. ముందు ఏదో ఒకటి చదివే అలవాటు బలపడితే తరువాత తరువాత కావలసిన పుస్తకాలు చదివేలా వారి దృష్టి మరల్చవచ్చు.

నెలకోసారి ఏదో ఒక పుస్తకాల షాపుకు పిల్లలను తీసుకెళ్ళడం, అప్పుడప్పుడు పాత పుస్తకాలు అమ్మే షాపుకు తీసుకెళ్ళడం అలవాటు చేస్తే, క్రమంగా వారికి పుస్తకాలను ఎంచుకునే ఆసక్తి పెరుగుతుంది. వీటన్నింటి కంటే ముందు ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు పుస్తకాలు చదువుతుంటే పిల్లలు వాళ్లను అనుసరిస్తారు. కాని ఎక్కువ మంది తల్లిదండ్రులు పుస్తకాల షాపుకు పిల్లలను తీసుకు వెళ్ళడం లేదు సరికదా ఇంట్లో ఉన్నా 24X7 టి.వి, సెల్‌ఫోన్స్‌తో, ఐప్యాడ్స్‌తో తల మునకలుగా ఉండటం దురదృష్టకరమైన పరిణామం.

tell me your friends I will tell you what you are అన్న సామెత మనుషుల్ని అంచనా వేయడానికి సరైన కొలమానం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అదే విధంగా show me your bookshelf I will tell you what you are అనికూడా చెప్పవచ్చు. ఇంటిలో పుస్తకాల షెల్ఫేలేని వాళ్ళను అంచనా వేయడం ఎవరికీ సాధ్యంకాదు. ఈ సందర్భంగా ‘పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటిది అన్న రోమన్‌ తత్వవేత్త Cicero మాటలు మనం పదేపదే మననం చేసుకోవాలి.

కొన్నేళ్ళ క్రితం మా అబ్బాయి అమెరికాలో ఒక మిత్రుని ఇంట్లో కొద్ది రోజులు ఉన్నాడు. ఆ మిత్రుడు కూడా డాక్టరే. రెండురోజులు వాళ్ళ ఇంట్లో ఉన్న తరువాత ఒక రోజు ఫోన్‌ చేసి ‘అంకుల్‌ వాళ్ళింట్లో మెడిసన్‌కు సంబంధించిన పుస్తకాలు తప్ప ఒక్క general book కూడా కనిపించలేదని” చెప్పాడు. అది విని ఆశ్చర్యపోవడం నావంతు అయింది. వాడి మాటలు వినగానే అలాంటిదే ఇంకొక సంగతి కూడా నాకు గుర్తొచ్చింది. గతంలో జూబ్లీహిల్స్‌లో ఒక మిత్రుడు ఇల్లు కట్టుకుంటే చూడటానికి వెళ్ళాము. మిత్రుని భార్య ఇల్లు మొత్తం తిప్పి మాకు చూపించారు. ఇది లివింగ్‌ రూమ్‌, దేవుడి గది, ఇది బాల్మనీ అని అన్నీ చూపిస్తూ ఎత్తు స్టూల్స్‌తో, చిన్న కౌంటర్‌లా ఉన్న చోటు చూపించి ఇది ‘బార్‌ కౌంటర్‌” అని చెప్పడంతో spiritual పుస్తకాలతో నింపాల్సిన షెల్ఫ్‌లను spirits తో నింపిన వారి great spirit ను ఆకళింపు చేసుకుని జీర్ణించుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది.

మరికొంత మంది ఇళ్ళలో పుస్తక ప్రదర్శన చూస్తుంటాం. అందమైన అద్దాల షోకేసుల్లో మంచిమంచి పుస్తకాలు చక్కగా అలంకరించబడి ఉంటాయి. ఎక్కడా ఏ పుస్తకమూ తెరిచిన, చదివిన ఆనవాళ్ళు కానరావు. కొంతసేపు వాళ్ళతో సంభాషిస్తే it is purely for public display rather than for reading and acquiring knowledge అన్న విషయం మనకు తెలిసిపోతుంది. మీ వద్ద ఉన్న పుస్తకాలను బట్టి మీ అభిరుచిని, వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సులభం. 19వ శతాబ్దికి చెందిన ప్రఖ్యాత ఫ్రెంచి నవలా రచయిత ముప్పె ప్రశ్నలతో Marcel Proust’s 35 questionnaire తయారు చేసి ఆ ప్రశ్నలకు ఒక వ్యక్తి చెప్పే సమాధానాల ఆధారంగా అతని వ్యక్తిత్వాన్ని ప్రవర్తనను, అంతరంగాన్ని అంచనా వేయడం సాధ్యమే అని ప్రయోగాత్మకంగా తెలియచేసాడు. మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో you are what you eat, you are what you think అన్న సూక్తికి you are what you read అని కూడా చేర్చవచ్చు.

పుస్తకాలు చదవడం వలన జ్ఞానం మాత్రమే కాదు ఆయుషు కూడా పెరుగు తుందట. ఇటీవల అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత యేల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ చేసిన పరిశోధనలో ప్రతిరోజూ కనీసం అరగంట సేపు పుస్తకం చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఆ అలవాటు లేనివారి కంటే కనీసం రెండు సంవత్సరాలు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తేలింది. అందుకని పుస్తక పఠనమే దీర్చాయుష్మాన్‌ భవ అన్న దీవెన కూడా అని తెలుస్తోంది.

పుస్తకాలు చదవడంలో ఎంత ఆనందం ఉందో చదివించడంలో రెట్టింపు ఆనందం ఉందని కొంత మందిని చూసిన తరువాతే అర్ధమయ్యింది. నేను గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియేట్‌ చదువుతున్న రోజుల్లో చిరుమామిళ్ళ సాంబశివరావు మాష్టారు ఇంగ్లీష్‌ చెప్పేవారు. వారి ఇంట్లో గది నలువైపులా పుస్తకాల ర్యాక్‌లు ఉండేవి. వాటి నిండా పుస్తకాలే. అవి చూసినప్పుడల్లా నేను కూడా మా ఇంట్లో అలాగే పుస్తకాలతో నిండిన ర్యాక్‌లను ఉంచుకోవాలనుకునేవాడ్ని ఆయన మంచిమంచి పుస్తకాలను పరిచయం చేసి నాలో పఠనాశక్తిని కలుగచేసారు. వారి ప్రభావంతో అంతకు ముందుకంటె ఎక్కువగా పుస్తకాలు చదవడం, సేకరించడం అలవాటయింది. వారిమేలు ఎన్నటికీ మరువ లేను.

పుస్తకాలు చదివించే అలవాటు గురించి ఇటీవల మిసిమి పత్రికలో కాండ్రేగుల నాగేశ్వరరావు గారు పుస్తక ప్రేమికులైన కీ॥శే॥ జుజ్జురపు చంద్రమౌళిగారిపై వ్యాసం వ్రాస్తూ చంద్రమౌళిగారు ఎప్పుడూ good books are to be xeroxed and sent to book lovers అనే వారని, నిత్యం ఈ పనిని వారు కుటీర పరిశ్రమలా నిర్వహించేవారని వ్రాసారు. పంపిన పుస్తకాలు మిత్రులకు అందాయోలేదో అని ఫోన్‌ చేసి మరీ అడిగి తెలుసుకునేవారట. ఇలా ఎంతో మందికి పుస్తకాలు పంపుతూ పుస్తక ప్రసాదమే నిజమైన ప్రసాదమని వారు నమ్మేవారు. సాహిత్యాన్ని కావలసిన వారికి చేర్చటంలో ఆయనకు అంత ఆనందం ఉంది.

చంద్రమౌళిగారి స్ఫూర్తితో ఈ వ్యాసం చదివిన వారందరూ ఇకపై ఎవరి ఇంటికి వెళ్ళినా పళ్ళు, స్వీట్స్‌, చాక్లెట్స్‌ తీసుకెళ్లడం మానేసి పుస్తకాలు ఇవ్వడం ప్రారంభిస్తే బాగుంటుంది. స్వీట్స్‌ తిని మర్చిపోయే అవకాశం (షుగర్‌ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు) ఉంది. కాని పుస్తకం చదివి మర్చిపోయే అవకాశం లేదు పైగా అదొక స్వీట్‌మెమరీ కనుక దయచేసి పాటించమని మనవి.



16 Replies to “చదువు – చదివించు”

  1. అవును అన్నయ్యా చదువు బ్రతుకుట కొరకే కాకుండా పుస్తక పఠనానికి అలవాటు పడాలి.such a nice article on book reading. One should make it a compulsory habit of reading atleast a book a day.

  2. Sir, I was very excited to read the article on reading habit. It was really needed for everyone to inculcate the sociability in their personality. It was a good thing to have a good person like you trying to serve the society in this way.

  3. Sir
    An excellent article on book reading. Reading not only enhance knowledge but also stops unnecessary thoughts to the mind. It will be a remedy for “idle men brain devil work shop”. I have noticed that you are a book lover when I visited your chamber. I hope that there will be a small/big library in your home. Congratulations sir.
    Anjaneya Reddy sumasri

  4. You made me read your excellent article on Read , make others Read.
    I forgot book reading engrossed in daily routine. Now I will make it a habit to read half an hour everyday Sir. 🙏🙏

  5. Reading this reminds me of a quote from Groucho Marx (at least the quote is popularly attributed to him)

    “Outside of a dog, a book is a man’s best friend. Inside of a dog, it’s too dark to read.”

    If Groucho were to be alive and be able to read Telugu and this article, he would rather go back to the grave.

  6. జన్మ అంటే భౌతింకంగా పుట్టడం. జీవించడం అంటే ఆనుక్షణం నీ ఉనికి నీ వివేకంతో ప్రసరిచడం.
    వివేకపు సుగంధ పుష్పానికి జ్ఞానం వేరు , అయితే పుస్తకం కొమ్మ.

  7. Sir, I really enjoyed reading this blog, of late this is the burning issue we are facing across the nation and the survey results may turn worsening in the near future if such information is not reached to the general public in a mass-way.

    SHOW ME YOUR BOOKSHELF- I WILL TELL YOU WHAT ARE – will bring the change if the parents inculcate the habit of reading by seeing the books daily in their shelves

  8. Sir
    Thanks
    మీ దగ్గర నుంచి చాలా పుస్తకాలు అందుకున్న కొద్ది మంది లో నేను ఒకరిని. ఆ 📚 చదివిన సమయంలో మరియు book shelf చూసే అపుడు కూడా మీరు మరియు మీ సలహాలు తప్పక గుర్తు వస్తాయి.

  9. Mee valla meeru ecchina pusthakalu chadivinanduvalla meerichchina audio CD s entho goppa rachayithalu naaku parichayammayyaru. Sri Ramana books mullapudi rachanalu audio kadhalu Annee goppa be. Mee abhlashaki chadivinchalane thapanaku padabhivandanam. Excellent article.mee bhaavaalu Manu kadilinchayi.

  10. బావుంది. కానీ change is the order of the day. ఒకప్పుడు ,,circulating libraries undevi . ఇప్పుడు కూడ Lakdi ka pool లో Uttam Book Stall ఉన్నది అనుకుంట . అలానే video libraries కనుమరుగు అఇనాఇ. కాల మహిమ. Quotation needs correction of typos

  11. Harsha, Article is very good. I remember you have gifted few books to my daughter when we have visited your house.
    There are typing mistakes in the quotation of Rukmini Aurndale. ( original text is perfect , only qutote is having mistakes. May take precaution next time.
    🙏🙏🙏🙏🙏

  12. Chaduvu-chadivinchu Anna sheersikalo vrasinadantha vaastavam. Gignaasa galigina veeriki NAA hrudaya poorvaka namassulu.chaalavemo. Koti dandaalu ante baaguntundi. Andaram pustakaalu chaduvudam. Samaskaram Leni chaduvu ……… anaa samethala untundi gada.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.