నీ మిత్రులెవ‌రో చెబితే నువ్వేమిటో చెప్పొచ్చు అనే మంచి మాట నేను కూడా గొప్ప‌గా చెప్పుకోవ‌డానికున్న అతికొద్ది మంచి మంచి మిత్రుల్లో మాన్యులు కె.కె.రామ‌స్వామిగారు ఒక‌రు.  మాట వ‌ర‌స‌కు వారిని మిత్రుల‌ని అన్నాను కాని వారు నాకు పితృస‌మానులే. రామ‌స్వామిగారు నాకంటే ఇర‌వై సంవ‌త్స‌రాలు పెద్దైనా 1994 లో మొద‌టిసారి వారిని గుడివాడ‌లో క‌లిసిన‌ప్ప‌టినుండి నేటికీ వారి సాంగ‌త్యం కొన‌సాగుతుండ‌టం అదృష్టం.

మొద‌టిసారిగా రామ‌స్వామిగారిని కామ‌ధేను రైస్మిల్ ప్రాంగ‌ణంలోనే ఉన్న వారి ఇంట్లో క‌లిశాను. వారు రైస్‌మిల్ నిర్వ‌హించే తీరు, అక్క‌డి ఉద్యోగుల‌ను ట్రీట్ చేసే విధానం చూసి వారిప‌ట్ల గౌర‌వభావం మ‌రింత పెరిగింది. అక్క‌డ ఉన్న స‌మ‌యంలో నాలుగైదు సార్లు వారిని కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసినా త‌రువాత అడ‌పా ద‌డ‌పా ఫోన్లో మాట్లాడ‌టం త‌ప్ప‌ వారిని నేరుగా క‌ల‌వ‌డం వీలు ప‌డ‌లేదు. మ‌ళ్ళీ ఇర‌వై ఐదు సంవ‌త్స‌రాల తర్వాత వారిని క‌లుసుకోవాల‌నిపించ‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. గుడివాడ‌లో కామ‌ధేను రైస్మిల్ పేరులోనే కాదు, మ‌రెన్నో విధాల ప్ర‌త్యేక‌మే. రామ‌స్వామిగారు రైస్‌మిల్ కాంపౌండ్‌లోనే ఇల్లు క‌ట్టుకున్నారు. సీసీ కెమెరాలు అంత‌గా లేని ఆ రోజుల్లో వారి ఇంటిలో అద్దంలో నుండి చూస్తే మిల్లు మొత్తం క‌న‌ప‌డేలా ఏర్పాటు చేసుకున్నారు. మిల్లులో ప‌నిచేసే 35 మంది ఉద్యోగులు, వ‌ర్క‌ర్స్ అంద‌రికి మిల్లు కాంపాండ్‌లోనే మంచి క్వార్ట‌ర్స్ క‌ట్టించారు. వ‌ర్క‌ర్స్‌ కోసం రోజూ సాయంత్రం చ‌దువు నేర్పేందుకు వ‌యోజ‌న విద్యా కేంద్రాన్ని కూడా మిల్లులోనే నిర్వ‌హించారు. రామ‌స్వామిగారికి పుస్త‌క‌ ప‌ఠ‌నం, సాహితీ ప్రియ‌త్వం ఎంత ఎక్కువంటే వారి అబ్బాయికి శ్రీ‌నాథ్ అని పేరు పెట్టుకునేంత‌. ఇన్ని ప్ర‌త్యేక‌త‌లున్న వారిని మ‌రోసారి క‌లిసి స్నేహాన్ని కొన‌సాగించాల‌నుకోవ‌డం వారిప‌ట్ల ఆస‌క్తితో ఇష్ట‌పూర్వ‌కంగానే.

ఇటీవ‌ల వారింట్లో ఒక రాత్రి బ‌స చేయ‌డంతో చాలా విష‌యాలు ముచ్చ‌టించుకున్నాం. కె.కె.రామ‌స్వామిగారి పూర్తిపేరు కాట్ర‌గ‌డ్డ కోదండ‌ రామ‌స్వామి. వారు 1938లో జ‌మీగొల్వేప‌ల్లి గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జ‌న్మించారు. వారి తండ్రి పెరుమాళ్ళు గారు జ‌మీగొల్వేప‌ల్లి గ్రామంలోని భార‌తీ నాట్య‌మండ‌లిలో స‌భ్యులు. పెరుమాళ్ళుగారి న‌ట‌నాభిలాష వ‌ల‌న ధ‌శ‌ర‌ధుడు, ధ‌ర్మ‌రాజు పాత్ర‌లు పోషించేవారు. రామ‌స్వామి గారు చిన్న‌త‌నంలో ఎన్నో నాట‌కాల‌ను చూడ‌టంతో పాటు లోహితాసునిగా న‌టించార‌ట కూడా. ఉదాత్త‌మైన పాత్ర‌ల‌ను గ‌మ‌నిస్తూ పెరిగిన రామ‌స్వామిగారు ఉత్త‌ములుగా ఎదిగారు.

డాక్ట‌ర్ శాంత‌గారికి రామ‌స్వామిగారి పాదాభివంద‌నం

రామ‌స్వామిగారు హైస్కూలు విద్య‌ ముగించి ఇంట‌ర్‌లో చేరిన త‌రువాత చ‌దువు మానుకుని వారి మామ‌గారి రైస్‌మిల్ లో చేర‌వ‌ల‌సిన ప‌రిస్థితుల్లో సైన్యంలో చేరిపోదామ‌ని 1954లో బెంగుళూరు చేరుకున్నారు. వెంట ఏ స‌ర్ట‌ఫికేట్స్ తీసుకు వెళ్ళ‌క‌పోవ‌డంతో అది వీలుప‌డ‌క మ్ర‌దాసు చేరారు. రామ‌దాసు గుడి కట్టేవరకు భ‌ద్రాద్రి సీతారాముడు పోక‌ల ద‌మ్మ‌క్క‌గారి  తాటాకు పందిరిలో త‌ల‌దాచుకున్న‌ట్లు బ‌స‌కుదిరే వ‌ర‌కు మ‌న రామ‌స్వామిగారు మ‌ద్రాస్ రైల్వేస్టేష‌న్లో త‌ల‌దాచుకున్నారు. ఆ త‌రువాత అనుకోకుండా ఆనాటి గొప్ప సంఘ‌ సేవ‌కురాలు శ్రీ‌మ‌తి ముత్తు ల‌క్ష్మీరెడ్డిగారి కుమారులైన కృష్ణ‌మూర్తిగారిని క‌లిశారు. వారు రామ‌స్వామిగారికి మొద‌ట‌గా నెల‌కు యాభై రూపాయ‌ల‌ జీతం, ఉచిత భోజ‌న‌, వ‌స‌తి సౌక‌ర్యంతో అడ‌యార్ క్యాన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప‌ని ఇప్పించారు. అక్క‌డ క్యాన్స‌ర్ ఆసుప‌త్రి నిర్వాహ‌కులు డా.శాంత‌గారి ప‌రిచ‌యం రామ‌స్వామిగారి జీవ‌త గ‌మ‌నాన్నే మార్చేసింది. ఇటీవ‌లే కీర్తిశేషులైన డా.శాంత‌గారు అడ‌యార్ క్యాన్స‌ర్ ఆసుపత్రి నెల‌కొన్న‌ప్ప‌టినుండీ అక్క‌డి రోగుల‌కు సేవ‌ల‌ను అందించారు. ఆమె తొంభైనాలుగు సంవ‌త్స‌రాల వ‌య‌సులో కూడా వారానికి రెండు రోజులు క‌నీసం ఇర‌వై మంది రోగుల‌ను ప‌రీక్ష చేసేవారు. వారి ఆశీస్సుల‌తో వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌ద్రాసులోని ఒక ఏడాది డిప్లొమా పూర్తిచేసిన రామ‌స్వామిగారు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌మెంట్ ఉత్త‌ర్వుల‌తో స్టాన్లీ మెడిక‌ల్ సెంట‌ర్‌లో కొంత‌కాలం, కీల్‌పాక్ ఇ.ఎస్‌.ఐ ఆసుప‌త్రిలో కొంత‌కాలం రేడియాల‌జి విభాగంలో ప‌నిచేశారు.

రామ‌స్వామిగారు అక్క‌డ ప‌నిచేసే స‌మ‌యంలోనే కెన‌డా నుండి కోబాల్ట్ ట్రీట్‌మెంట్ మిష‌న్‌ కొత్త‌గా మ‌ద్రాసుకు వ‌చ్చింది. ఆ మిష‌న్ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేస్తున్న రామ‌స్వామిగారు అప్ప‌టి భార‌త రాష్ట్రప‌తి బాబురాజేంద్ర ప్ర‌సాద్‌గారు క్యాన్స‌ర్ ఆసుప‌త్రి 1957-1958 ప్రాంతంలో సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు కొత్త‌గా మిష‌న్ ప‌నితీరు వారికి చూపించే అవ‌కాశం వ‌చ్చింది. రాష్ట్రప‌తి సంద‌ర్శ‌న‌వార్త ఇండియ‌న్ న్యూస్‌రీల్‌గా తీయ‌డంతో ఆ న్యూస్‌రీల్ గుడివాడ థియేట‌ర్‌లో ప్ర‌దర్శించిన‌ప్పుడు రామ‌స్వామిగారి తండ్రి పెరుమాళ్ళుగారు కుమారుడిని గుర్తుప‌ట్టి మ‌ద్రాసు చేరుకున్నారు. 1954లో ఇల్లు విడిచిన రామ‌స్వామిగారు 1958 వ‌ర‌కు ఇంటివారికి త‌మ ఆచూకీ దొర‌క‌నివ్వ‌లేదు.

రామ‌స్వామిగారికి 1961లో వారి మేన‌మామ‌గారి కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి గారితో వివాహం జ‌రిగి 1962 నుండి 1967 వ‌ర‌కు ఏలూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ప‌నిచేశారు. ఈ స‌మ‌యంలోనే వారికి ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుగారి అన్న‌పూర్ణ ప‌ల్వ‌రైజ‌ర్స్ ఉద్యోగుల‌తో స్నేహం కుదిరి వారి ప్రోద్భ‌లంతో 1967 లో బ‌ళ్ళారిలో విజ‌య‌దుర్గ ప‌ల్వ‌రైజ‌ర్స్ అనే Agro – Chemicals సంస్థ‌ను ఏర్పాటుచేసి 1991 వ‌ర‌కు అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించారు. త‌రువాత 1983 లో హ‌స‌న్‌లో ముప్పైవేల కోళ్ళ‌ ఫార‌మ్ కూడా నిర్వ‌హించారు. రామ‌స్వామిగారు వ్యాపార‌ప‌రంగా ఎంతో ఎదిగినా మూలాల్ని, విలువ‌ల్ని, గ‌తాన్ని మ‌రువ‌ని గొప్ప సంస్కార‌వంతులు. డా.శాంత‌గారి ఆశీస్సుల‌తో, స్ఫూర్తితో నేటికీ ప్ర‌తి సంవ‌త్స‌రం Adayar Cancer Institute కు వారు ఎంతోకొంత విరాళం ఇస్తున్నారు.

డా.శాంత‌గారు కీర్తిశేషులు కావ‌డానికి ఒక ఏడాది ముందు రామ‌స్వామిగారు త‌మ‌ కుటుంబ సభ్యులంద‌రినీ (మ‌నుమ‌లు, మ‌నుమ‌రాండ్ర‌ల‌తో స‌హా) మ‌ద్రాసు తీసుకెళ్ళి డా.శాంత‌గారిని క‌లిసి వారి ఆశీస్సులు పొందారు. విశ్వాసం, కృత‌జ్ఞ‌తా గుణం ఉన్న‌వారు జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటార‌న‌డానికి రామ‌స్వామిగారే ప్ర‌త్య‌క్ష ప్ర‌మాణం. డా.శాంత‌గారి స్ఫూర్తితో రామస్వామిగారి మ‌నుమ‌రాలు. చి.శ్రావ‌ణి ఎం.బి.బి.ఎస్ చ‌దువుతుండ‌టం విశేషం. డా.శాంత‌గారి ప‌ట్ల వారి కుటుంబానికి ఆప్యాయ‌త‌, అత్యంత గౌర‌వం. రామ‌స్వామిగారు జీవితంలో స్వ‌యంకృషితో, ప‌ట్టుద‌ల‌తో ఎదిగారు. నేను మ‌ళ్ళీ క‌లిసేట‌ప్ప‌టికి వారు ఎనిమిది ప‌దులు దాటేసినా రోజూ చ‌ద‌వ‌డం, వ్రాసుకోవ‌డం మాన‌లేదు. ఇప్ప‌టికీ వారు కారు డ్రైవింగ్ చేస్తుండ‌టం విశేషం. నేను వారిని క‌ల‌వ‌డానికి వెళ్ళిన‌రోజు న‌న్ను ఆహ్వానించ‌డానికి నాకోసం  వారు వీధి చివ‌ర వ‌ర‌కు న‌డిచి వ‌చ్చి నాకోసం ఎదురుచూసేంత సౌజ‌న్య‌వంతులు.

పుస్త‌కాలు చ‌దువుతూ అందులోంచి మంచి విశేషాలు డైరీల్లో వ్రాసుకోవ‌డం. వాటిని పున‌శ్చ‌ర‌ణ చేసుకోవ‌డం వారి జీవ‌న‌శైలి. వారింట్లో ఒక చిన్న గ్రంథాల‌య‌మే ఉంది. ఇన్ని విజ‌యాలు సాధించిన రామ‌స్వామిగారికి వారి అర్థాంగి శ్రీ‌మ‌తి విజ‌య‌ల‌క్ష్మి గారు నిజంగా Better Half యే. ఆమె జీవ‌న స‌హ‌చ‌రిగా ఎంతో స‌హ‌నంతో వారి వెంట‌న‌డ‌వ‌డం కూడా వారి విజ‌యానికి మ‌రింత తోడ్ప‌డింది. రామ‌స్వామిగారి జీవ‌న ప్ర‌స్థానంలో వారికి ఎన్నో ఒడిదుడుకులు క‌ష్ట‌న‌ష్టాలు క‌లిగినా వారు ఎవ‌రికి క‌ష్టం క‌లిగించ‌కుండా ఎంతో స్థిత‌ప్ర‌జ్ఞ‌తో నిలిచారు.

డాక్ట‌ర్శాంత‌గారితోరామ‌స్వామిగారికుటుంబం

1989లో వారి అబ్బాయి శ్రీ‌నాథ్‌కు బ‌ళ్ళారి పొలిమేర‌ల్లో పెద్ద యాక్సిడెంట్ అయ్యింద‌ట. జీప్‌లో ఆ తోవ‌న పోతున్న అప‌రిచితులు శ్రీ‌నాథ్‌ను ఆసుప‌త్రిలో చేర్చివెళ్ళారు. శ్రీ‌నాథ్‌ను Air Ambulance లో బెంగుళూరు త‌ర‌లించి వైద్యం చేయించ‌డంతో కోలుకున్నాడు. స‌రిగ్గా యాక్సిడెంట్ అయిన సంవ‌త్స‌రం త‌రువాత రామ‌స్వామిగారు బ‌ళ్ళారిలో ఒక Thanks giving స‌భ ఏర్పాటుచేసి శ్రీ‌నాథ్‌ను ఆ రోజు ఆసుప‌త్రిలో చేర్చిన అజ్ఞాత‌వ్య‌క్తుల్ని వెదికి ప‌ట్టుకుని వారిని ఆహ్వానించి వారితోపాటు శ్రీ‌నాథ్‌కు వైద్యం చేసిన న‌ర్సులు, డాక్ట‌ర్స్‌, ర‌క్త‌దాత‌ల్ని పేరు పేరునా అంద‌ర్నీ స‌త్క‌రించి త‌మ కృత‌జ్ఞ‌త‌ను తెలియ‌జేశారు.

రామ‌స్వామిగారు బ‌ళ్ళారిలో ఉన్న రెండు ద‌శాబ్దాల‌పై కాలంలో స్థానికంగా ఎన్నో కార్య‌క్ర‌మాల‌కు స‌హాయ‌ స‌హ‌కారాలందించారు. అప్ప‌టి ప్ర‌ముఖ రాజ‌కీయ‌వేత్త‌ల‌తో, సాహితీమూర్తుల‌తో అధికారుల‌తో వారికి గ‌ల స్నేహ‌ ప్రియ‌త్వం వ‌ల‌న బ‌ళ్ళారిలో భువ‌న‌విజ కార్యక్ర‌మాన్ని ఉద్దండుల‌తో నిర్వ‌హించారు.

రామ‌స్వామిగారు ఎంత ఎదిగినా విన‌మ్రులు, అత్యంత నిరాడంబ‌రులు, స్నేహ‌ప్రియులు. నేను ఎప్పుడు ఫోన్‌చేసినా ఫోన్ ఎత్తిన‌వెంట‌నే “నమస్కారం సార్” అని వారు అన్న‌ప్పుడు నాకు ఎంతో సిగ్గ‌నిపిస్తుంది. వారి ఉన్న‌త హృద‌య‌ సంస్కారం ముందు నేనెప్పుడూ చిన్న‌వాడినే.

మొన్న మ‌ళ్ళీ క‌లిసిన‌ప్పుడు మాట‌ల్లో మాట‌గా రామ‌స్వామిగారు, వారి ధ‌ర్మ‌ప‌త్ని విజ‌య‌ల‌క్ష్మిగారు త‌మ నేత్రాల‌ను, శ‌రీరాల‌ను వైద్య‌ క‌ళాశాల‌కు దానం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుని స‌మ్మ‌తి ప‌త్రాల‌ను ప‌దిహేనేళ్ళ‌కు పూర్వ‌మే క‌ళాశాల‌కు అంద‌జేశామ‌ని చెప్పారు. ప‌రోప‌కారం ఇదం శ‌రీరం అంటే ఇంత‌క‌న్నా ఇంకేమైనా ఉంటుందా. కుటుంబ బాధ్య‌త‌ల‌న్నీ స‌మ‌ర్థ‌వంతంగా నెర‌వేర్చిన రామ‌స్వామి దంప‌తులు ఇప్పుడు ప్ర‌శాంత‌మైన వానప్రస్థ జీవితాన్ని గ‌డుపుతున్నారు.

రామ‌స్వామిగారు ధన్యులు. వారిని మిత్రులుగా పొందిన వారంద‌రూ మ‌రింత ధన్యులు. వారిని గురించి నాలుగు మాట‌లు అనుకోవ‌డానికి అంగీక‌రించి వారి అనుభ‌వాల‌ను నాతో పంచుకున్నందుకు రామ‌స్వామిగారికి న‌మ‌స్సులు.

25 Replies to “జీవన సాఫల్యం”

  1. Harshavardhan uncle, namasthe…very neatly written about Ramaswamy garu. Happy to know about his care towards employees, organizing skills of running business,gratitude about Dr. santha madam.. thank you

  2. Harsha sir,
    Thank you for such inspiring,motivating post.Its learning values ,not from books but such live examples.The great gesture of remembering people who helped at times of crisis is a rare virtue nowadays. Goodness still exists on Earth in the form of Ramaswamy garu

  3. Sri Harshavardhan garu,
    Very will written about a great human being. Felt like you should have written more.

  4. Very good story anna. We need kind people like him. The article should be eye opener for at few people who are starving for money and status.

  5. Bavagaru the way you have explained the personality of Ramaswamy garu is marvelous. There are many learnings especially GenY should read and learn. Good initiative and continue writing such articles

  6. A true real time story well narrated in a nut shell about the friendship, relationship, hard work, simplicity, humbleness and ethical values.

    A good lesson for everyone to emulate and inculcate the habits of respecting elders with a sense of humility.

    Today our society is caught in a chaotic, frenzied spiral of a new addiction – people are chasing money, power, success and a wilder, faster pace of life. Just like any addiction, people are out of control in their behaviors, feelings and thinking, yet they believe they are normal.

    Sharing these kind of good experiences are need of the hour which of course would enrich oneself and make them walk in the righteous path.

    Thank you Harshavardhana garu for sharing your experiences with Dr Shantha Madame and Shri K K Rama Swamy, a multifaceted personality.🌷🙏🌷

  7. A true real story well narrated in a nut shell about the friendship, relationship, hard work, simplicity, humbleness and ethical values.

    A good lesson for everyone to emulate and inculcate the habits of respecting elders with a sense of humility.

    Today our society is caught in a chaotic, frenzied spiral of a new addiction – people are chasing money, power, success and a wilder, faster pace of life. Just like any addiction, people are out of control in their behaviors, feelings and thinking, yet they believe they are normal.

    Sharing these kind of good experiences are need of the hour which of course would enrich oneself and make them walk in the righteous path.

    Thank you Harshavardhana garu for sharing your experiences with Dr Shantha Madame and Shri K K Rama Swamy, a multifaceted personality.🌷🙏🌷

  8. A true real time story well narrated in a nut shell about the friendship, relationship, hard work, simplicity, humbleness and ethical values.

    A good lesson for everyone to emulate and inculcate the habits of respecting elders with a sense of humility.

    Today our society is caught in a chaotic, frenzied spiral of a new addiction – people are chasing money, power, success and a wilder, faster pace of life. Just like any addiction, people are out of control in their behaviors, feelings and thinking, yet they believe they are normal.

    Sharing these kind of good experiences are need of the hour which of course would enrich oneself and make them walk in the righteous path.

    Thank you Harshavardhana garu for sharing your experiences with Shri K K Rama Swamy, a multifaceted personality.🌷🙏🌷

  9. మానవ సంబంధాలు మృగ్యం అవుతున్న ఈరోజుల్లో అటు వంటి వారి సాంగత్యం కలగటం నిజంగా అదృష్టం.

  10. Hi Anna,
    Rama Swami Garu very incredible person, you explained very well about the Rama Swami garu. Thank you so much for introducing such a wonderful person. Now a days it’s very hard to find that kind of personalities. 🙏🙏🙏🙏

  11. Though I donot know Mr Ramaswamy, the description of this gentleman thru another good friend of mine Mr Harshavardhan , who belongs to a well educated and modest and humble family is known well thru 60’s. No age big difference between us both, but he is my advisor and takes me on the right path on the few occassions I was treading into an undesirable situation. Our frienship Praveen+Harsha starts from Srirammurthy garu(Harsha’s father) and KesavaRao garu(Praveens father).WE were neighbours in the police qtrs @ Nellore. Our parents (fathers) passed away after going upto the Addnl SP Cadre. I heard that Srirammurthy garu insisted hot food and curries be served to his driver. Its a unique treatment in the police dept. To such a great man is born Harshavardhan and so he could observe this extraordinary qualities with Ramaswamy in his rice mill.

  12. రామస్వామి గారు లాంటి వారు ఉంటారు నూటికో కోటికో🙏, అటువంటి గొప్ప వ్యక్తి గురించి తెలియచేసి నందుకు కృతజ్ఞతలు🤝

  13. Very inspiring personalities
    Sri Ramaswamy Garu
    Santha Garu
    Really it is our privilege to be in your contact list through which we are enlightened by these eminent personalities

  14. రామస్వామి గారి లాంటి వ్యక్తులు సమాజంలో అరుదుగా ఉంటారు. వారి జీవితం సాఫల్యం పొందినట్టే. వారు మిమ్మల్ని ప్రభావితం చేయడం సంతోషం. మీరు చాలా చక్కగా వివరించారు. ఇది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.

  15. Andaro mahanubhavulu. Marugunavunna alaativaarini parichayam chestunnanduku krutagnatalu.
    Ramaswamy Garu pratah smaraneeyulu
    🙏🙏🙏

  16. అయ్యా!
    హర్షవర్థన బావగారూ!

    అందుకే మీరంటే మీ పరిచయస్తులందరికీ ఎంతో గౌరవము, భక్తిభావమూను.

    మీకు తెలిసిన వారిని, పరిచయస్తులనూ మనసారా పలకరిస్తుంటారు. వీలయినంతవరకు వారి సమస్యల పరిష్కారం కొరకు మనసా, వాచా మరియు కర్మణా ప్రయత్నం చేస్తున్నారు.

    మీతో సాంగత్యం ఉన్న వారందరి గురించి మీరు మీ రచనా వ్యాసంగం ద్వారా వారిలో ఉన్న ఉన్నతత్త్వాన్ని అందరికీ పరిచయం చేయడం ద్వారా సమాజంలో ధర్మ పరిరక్షణకు మీరు చేసే ఈ సేవ ఉత్కృష్ఠమైనది.

  17. వివరాలు ఆసక్తిగా వున్నాయి. Nice person

  18. Harsha
    Thank you very much for enlightening us about Sri.Ramaswamy garu.

    Very Great to know about such an inspiring person.

    Please convey my humble respects to him 🙏

  19. శ్రీ రామస్వామి గారు, ఆదర్శవంతులు.

    మీరు చాలా విపులంగా వివరించారు.

    డా. శాంతా గారు, రామస్వామి గార్ని;. రామస్వామి గారు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినట్లు స్పష్ట మవుతోంది.

  20. శ్రీ రామస్వామి గారు, ఆదర్శవంతులు.

    మీరు చాలా విపులంగా వివరించారు.

    డా. శాంతా గారు, రామస్వామి గార్ని;. రామస్వామి గారు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినట్లు స్పష్ట మవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.