ఎప్పుడో ఇరవై ఏళ్ళనాటి ముచ్చట. ఉద్యోగమొకచోట కుటుంబం ఒకచోట ఉండటంతో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరు- విజయవాడ మధ్య సీజన్‌ టిక్కెట్‌పై ప్రయాణంచేస్తున్న రోజుల్లో ఒక సాయంత్రం ఏలూరులో జనరల్‌ బోగీ ఎక్కి కూర్చున్నా. రైలు రద్దీగా లేకపోవడంతో సీటు దొరికి రైలు కదులుతుందనగా ముగ్గుబుట్టలా నెరసిన తలపై చిన్నబుట్టతో బోసి నవ్వుల పెద్దమ్మ మా బోగీలో కెక్కింది. బుట్టలో రెండో మూడో కిలోల వేపిన శెనక్కాయలున్నాయి అమ్ముకోడానికి. రూపాయికింత పొట్లాంకట్టి నా ప్రక్కన కూర్చున్న వాళ్ళకు, ఎదురుగా ఉన్నవాళ్ళకు ఇచ్చింది.

పుస్తకంలో తలముంచుకున్న నేను ఇది చూసీ చూడనట్లు కూర్చున్న శెనక్కాయలు కొన్నవాళ్ళు ఒక్కొక్కటే ఒలుచుకొని తినడం మొదలెట్టారు. నా ఎదుటి సీట్లో ఉన్న తల్లి మూడేళ్ళ పసివాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకునుంది. ఆ పసివాడు నా పక్కన, ఎదుటకూర్చున్న వాళ్ళు శెనక్కాయలు తింటుంటే వాళ్ళ చేతులవంక నోళ్ళవంక మార్చిమార్చి చూస్తూ, వాళ్ళమ్మని కొనివ్వమని మారాం చేయడం మొదలెట్టాడు. కనీసం అవి కూడా కొనివ్వలేని ఆ తల్లి వాడ్ని సముదాయించడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. శెనక్కాయలు అమ్ముకుంటూనే పెద్దమ్మ క్రీగంట వాడిని గమనిస్తోంది. రైలు నడుస్తోంది; వాడి మారాం ఇంకా ఇంకా ముదురుతోంది. కాసేపటికి ఏదో స్టేషన్‌లో రైలాగింది. శెనక్కాయల బామ్మ ఇంకో బోగీలోకి మారబోతూ ఒక కాగితంలో శెనక్కాయలు చుట్టి చంటోడి చేతిలో పెట్టి బుగ్గలు చిదిమి వాడి ముఖంపై నవ్వలు పూయించి బండి దిగిపోయింది.

ఇదంతా వినోదంగా గమనిస్తున్న నా మట్టిబుర్రకు పసివాడికి శెనక్మాయలు కొనివ్వాలన్న బుద్ధి పుట్టలేదు. అస్సలు అలాంటి ఆలోచనే రాలేదు. ఆ క్షణాన ఆ పెద్దమ్మ ఔన్నత్యం ముందు నేను మరుగుజ్ఞునై పోయా! ఎవరికైనా ఎంతో కొంత సాయపడాలంటే సంపద కాదు కేవలం సంకల్పం ఉంటే చాలని ఎరుక కలిగించిన పేదరాశి పెద్దమ్మకు మనసులోనే నమస్మరించుకున్నా.

బౌద్ధగురువులు దలైలామా, ‘Be kind whenever possible, it is always possible‘ అన్నది, భవభూతి, “ఏకో రసః కరుణయేవా” అన్నది, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు, ‘దయగల హృదయమే దైవ మందిరం” అన్నది ఎందుకో నాకు బాగా తెలిసొచ్చింది. ఇది జరిగి ఇరవై ఏళ్లయినా ఇప్పటికీ ఏ రైలెక్కినా యాంత్రిక జీవనంలో పడి కొట్టుకుపోతూ ఎక్కడో గడ్డ కట్టుకుపోయివున్న మానవత్త్వాన్ని తట్టి నిద్రలేపిన ఆమె ఔదార్యం నా మదిలో మెదులుతూనే ఉంటుంది ……

27 Replies to “పేదరాశి పెద్దమ్మ”

  1. Peddamma ante pedda manasu unna Amma. Prema choopinchadaniki Sampada undnavasaram ledu. Sadhgunamulu poola laaga sugandhamunu vedajalluthuntayi. Your expressions are excellent. Manchi anubhavale andariki pathaalu. Your story touches the soul👌

  2. బాగుంది. రెండు చదివాను. నాని కధలు.

  3. A thought provoking blog, I must say. We face similar situations in our life daily. Though there is an intention for us to help the opposite person, we do not proceed as we are not aware of the opposite persons situation and his/her reaction if you offer help. I could visualise the smile on the faces of the child and the old lady.
    Keep writing anna.

  4. Respected Sir,తమరు చెప్పిన నాలుగు జీవిత సత్యములు.

  5. Sir, you’ve volunteered to fail to express greatness of Pedamma.
    Hats off to your magnanimity. You are not a small personality.
    God bless you Sir.

  6. పేదరాశి పెద్దమ్మ అనుభవం చాలా బాగుంది. ఇలాంటివి ఇవి మన జీవితంలో ఎన్నో ఎదురవుతుంటాయి. వాటిని హ్యూమన్ టచ్ ఉన్న వ్యక్తులే గుర్తుంచుకుని తమను తాము గొప్ప వ్యక్తులుగా మలుచుకుంటారు. ఇలాంటి అనుభవాల్ని తెలియజేయటం మంచి మార్గదర్శకం అవుతుంది. అభినందనలు.

  7. ఒక్కోసారి చిన్న సంఘటనలే మన మనస్సులను ప్రభావితం చేస్తాయనటానికి వాస్తవ రూపమే ఈ పేదరాశి పెద్దమ్మ.
    అయితే అలా ప్రభావితమైన విషయాన్ని (ధాతృగుణం)
    స్ఫురణలో వుంచుకొని ద్విదశకాల తరువాత కూడ ఇలా పంచుకోవటం మీ సహృదయతకు తార్కాణం, మాకు స్ఫూర్తిదాయకం.

  8. మినీ కవితల్లా చాలా ఉపయోగకరమైన విషయాలతో
    బాగా వ్రాసారు…

  9. Pedaraasi peddamma and sheersikalo unna amsamnatchindi. Venakatiki oka mitrudu adigadu. Mallikarjuna dabbu rvariki avasaram ani. Unnodike ani samadanam itchanu. Athadu yentha navvado. Nijame… Dabbu lenivaadu yelagu sarduku brathukuthaadu KAANI unnodiki dabbu lekapothe brathakaledu. Anduke Karnudu anaga Know nthi kumaarudu yedama chetho chesinadi kudi chethiki kooda theliya koodadannadu. Vaastavaani cheyyi chaachatam valla manam nadhtapoyedi EMI Ledu. Deevenaki Aaseervaadaaniki oka mettu ekkinatte. Devuditchina pranam intenegada iyyalane thapana. Pranam itchina devunni sthuthinchaka pothe ivvatam thelledu. Maa Harshavardan garu CTOga unnappudu nenu illu kattukunnanu. Vertu Maaya sahayam kooda chesaru. Flooringlu – prahareelu EMI lekundane andulo nivaasam modaletettam. EMI kattaliga. Oka roju illantha vedikina oka ruupayi kooda dorakala. Aaroju patchi mirapakayala pulusu. Appude mitruni raaka. Emchyyali. Sare koncham sepu maatladi aapy prardanaku upakraminchanu. Srimathi piluputho andaram vindu aaraginchamu. Aaroju as patchimirapakaayala pulusu entha baagundi cheppalem.

  10. నమస్సుమాంజలులు! మీ యీ చక్కటి blog కు ఇదే నా మెచ్చుకోలు. మీరు ఏది చేసినా మంచి మనసుతో నే. Friends ని inspire చేయడంలోనూ మీకు మీరే సాటి ఈ blog నిరంతరం నడవాలని మమ్ముల మంచి బాట లో నడిపించాలని ఆశ👏👏👏💐💐🙏🏼🙏🏼

  11. Sampada kaadu sankalpam mukhyam anee adbutamaina nijaanni kallaku kattinatlu teliyachesaru ancle… great start.
    I will definitely follow your work here, very gald that your words will be on the web for our reference forever 🙂 🙂

    1. Everyone come across similar moments…some can notice..a few can evolve..very little can narrate even after so many years

    2. Sir
      In this column helping is her greatness and expressing your actual feelings with out hesitation is your greatness. In Tenali where you and I worked. there is a beggar with one leg only before chitti Anjaneya Swamy temple (which is very famous) who used to beg throughout the year by cleaning the road before the temple and donate the entire amount to the temple on the occasion of Sriramanavami. As you told intention is important. Like this there is a story between duryodhana and karna. I will tell when we happened to speak. Congratulations sir.
      Anjaneya Reddy sumasri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.